Aranmanai 4: స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ ‘అరణ్మనై 4’ (Aranmanai 4). హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిని ఈ చిత్రం తెలుగులో ‘బాక్’ (BAAK) టైటిల్‌తో ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఛిల్ అవుతూ థ్రిల్ అయ్యేందుకు రెడీ..
ఈ సందర్భంగా సినిమానుంచి కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘ఛిల్ అవుతూ థ్రిల్ అయ్యేందుకు రెడీగా ఉండండి’ అంటూ సుందర్ సీ, రాశీఖన్నా (Raashi Khanna) , తమన్నా (Tamannaah Bhatia) , వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డిల పాత్రలతో డిజైన్ చేసిన పోస్టర్‌ను నెట్టింట షేర్ చేశారు. అరణ్మనై ఫ్రాంచైజీలో వస్తోన్న ఈ చిత్రంలో తమన్నా, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ సుందర్ సి, తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లను లాంఛ్ చేసి తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తమన్నా పోషిస్తున్న శివాని లుక్‌లో సంప్రదాయ చీరకట్టులో చేతిలో హారతి పట్టుకొని ఉంది.
#BAAK 🦇 vachestundhi 😰
Get ready to scream with chills & thrills 🔥RELEASING IN CINEMAS ON APRIL 2️⃣6️⃣TH 🎥
A Film by #SundarC
A @hiphoptamizha Musical 🎶Telugu Release by @asiansureshent ✨#Aranmanai4 @tamannaahspeaks #RaashiKhanna @ActorSanthosh #VennelaKishore… pic.twitter.com/IRQDPanabU
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2024
ఈ మూవీలో వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిఝా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. కొందరంటారు ఈ ఖరీదైన విల్లా చలిగా ఉంటుందని, ఈ భవంతి చాలా చల్లగా ఉంటుందని మరికొందరు చెబుతారు.అరణ్మనై 4 వేసవికి చక్కటి నవ్వుతోపాటు చల్లదనాన్ని, థ్రిల్లను అందించేందుకు మీ ముందుకు వస్తోంది.. అంటూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రాన్ని Avni Cinemax, Benzz Media సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Also Read: ‘ఓ స్త్రీ రేపు రా’ మళ్లీ వస్తోంది.. టీజర్ చూస్తే వణుకు పుట్టాల్సిందే!