AP Finance Minister: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు కేబినెట్లో ఆర్థిక మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా యనమల పని చేశారు. కానీ ఈసారి యనమలకు చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కలేదు. కాంగ్రెస్ హయాంలో ఆనం రాంనారాయణరెడ్డి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే.. ఈసారి ఆర్థిక మంత్రి ఆయన అవుతారా? లేదంటే పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖ ఇస్తారా? అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. వైసీపీ హయాంలో పీఏసీ చైర్మన్‌గా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు పయ్యావుల కేశవ్. ఆర్థిక అంశాలపై పట్టు సాధించారు పయ్యావుల.