Janasena Party : మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచేందుకు.. వైసీపీ(YCP) ని ఓడించేందుకు జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ALSO READ: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఫిబ్రవరి నుంచే..
ఈ నెలాఖరు నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటనలు చేపడుతారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఫిబ్రవరిలో క్షేత్రస్థాయిలో సమావేశలు నిర్వహిస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ కు ఓడించేందుకు ప్రతీ రోజు మూడు సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనేలా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. 187 మందితో ఎన్నికల నిర్వహణ జోనల్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అభ్యర్థులపై కసరత్తు…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఇప్పటికే కసరత్తు చేసి అభ్యర్థులను ప్రకటించగా.. పొత్తులో ఉన్న జనసేన, టీడీపీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. వై నాట్ 175 నినాదంతో మరో సారి అధికారంలోకి రావాలని అనుకుంటున్నా వైసీపీ వేగానికి స్పీడ్ బ్రేకర్లు వేసేందుకు జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యాచరణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో జనసేనను 35 నుంచి 40 స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ కోర్చుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులను జనసేన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
వైసీపీ ఎమ్మెల్యేల కోసమే..
ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వేలు చేయించిన వైసీపీ అధిష్టానం.. గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టికెట్ రాని కొందరు వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. దీన్నే అవకాశంగా తీసుకున్న జనసేన, టీడీపీ(TDP) లు వారిని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ 5వ లిస్ట్(YCP 5th List) కొరకు వేచి చూస్తున్నారు. ఈ లిస్ట్ వస్తే మరికొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరుతారని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: సీఎం జగన్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
DO WATCH: