Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడికి వెళ్లిన ప్రజల మనసును గెలుచుకుంటున్నారు. తాజాగా, కాకినాడ జిల్లా (Kakinada District) లో తాను వెళ్తున్న దారిలో ఆందోళన చేపట్టిన బాధితులను కాన్వాయ్ ఆపి మరి వారి సమస్యను తెలుసుకున్నారు. కొత్తపల్లి మండలంలో పలువురు బాధితులు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు. గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ ఆపి వాళ్లతో మాట్లాడారు.
Also read: ఇలా ఉండటం బాధాకరం.. ఇకపై ఈ పరిస్థితి ఉండదు: మంత్రి నాదెండ్ల
గత వారంలో కొండెవరంలో ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతం అయ్యారు. వారి సమస్య తెలుసుకున్న పవన్ కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. ఇది చూసిన పవన్ అభిమానులు దట్ ఈజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.