Nayanthara Annapoorani Movie : కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన వివాదాస్పద చిత్రం ‘అన్నపూర్ణి’ మళ్లీ ఓటీటీ వేదికపైకి రాబోతోంది. ఈ చిత్రం గతంలో కొన్ని వివాదాల కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించబడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి ‘సింపుల్ సౌత్’ ఓటీటీలో ప్రసారం కానుంది. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ కూడా పెట్టారు మేకర్స్.
అదేంటంటే, ఈ చిత్రం భారతదేశంలో మాత్రం అందుబాటులో ఉండబోదని సమాచారం.’అన్నపూర్ణి’ చిత్రంలో నయనతార టైటిల్ రోల్ పోషించింది. నయన్ యాక్ట్ చేసిన 75వ సినిమా ఇది. గతేడాది డిసెంబరు 1న థియేటర్లలో రిలీజైంది. అదే నెల చివర్లో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. అయితే ఇందులో ఓ బ్రహ్మణ అమ్మాయిని నాన్ వెజ్ వంటలు వండే చెఫ్‌గా చూపించడం పలువురి మనోభావాలు దెబ్బతీసింది.
Annapoorani is BACK 🧑🏻🍳
Worldwide, excluding India — ONLY on Simply South from August 9. pic.twitter.com/rZELVlhLNR
— Simply South (@SimplySouthApp) August 6, 2024
Also Read : మరో హాలీవుడ్ ఆఫర్ అందుకున్న ధనుష్.. ఈసారి అతిపెద్ద ఫ్రాంచైజీలో!
దీంతో ఈ సినిమాపై నానా రచ్చ జరగడంతో నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. అటు నయనతార సైతం క్షమాపణలు చెప్పింది. ఇక ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం దాదాపు ఏడు నెలల తర్వాత సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండటంతో మరోసారి వివాదాలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు పలువురు భావిస్తున్నారు.