Jai Hanuman: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వచ్చిన సినిమా హనుమాన్. ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. గతేడాది అత్యధిక వసూళ్లను కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు తెలిపారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
‘‘వెల్కమ్ టు అంజనాద్రి 2.0’’
అయితే తాజాగా సీక్వెల్ సంబంధించి క్రేజీ అప్డేట్ వదిలారు ఈ యంగ్ డైరెక్టర్. ‘‘వెల్కమ్ టు అంజనాద్రి 2.0’’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చుట్టూ అందమైన కొండలు.. మధ్యలో పెద్ద నది.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపిస్తూ.. దానికి ‘హనుమాన్ మూవీలోని ‘రఘునందన’ పాటను జోడించారు. జై హనుమాన్ నుంచి వచ్చిన ఈ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాల్ వైరల్ గా మారింది. దీంతో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి.
View this post on Instagram
‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటీ అనే ప్రశ్నకు సమాధానంగా జై హనుమాన్ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో ఆంజనేయ స్వామి మెయిన్ హీరోగా.. .. తేజ సజ్జ హనుమంతు పాత్రలో కనిపించనున్నారు. ఆంజనేయ స్వామి పాత్రను ఓ స్టార్ హీరో చేయబోతున్నట్లు సమాచారం. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: Hero Nithin: పవన్ టైటిల్ తో నితిన్ మూవీ.. అదిరిపోయిందిగా .. ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్ పోస్టర్