Anjali Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) చిన్న కూతురు అంజలి ఫస్ట్ అటెమ్ట్ లోనే యూపీఎస్సీ (UPSC) అర్హత సాధించడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. అంజలి బిర్లా మొదటి ప్రయత్నంలోనే UPSC పరీక్ష ఎలా ఉత్తీర్ణురాలైంది? అంజలి బ్యాక్‌డోర్ ఎంట్రీ ద్వారానే ఉద్యోగం సాధించగలిగింది అంటూ పెద్ద ఎత్తున పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో అంజలి బిర్లా పేరు నెట్టింట చాలా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలు నిజమేనా? లేక కావాలనే బురదజల్లుతున్నారా అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం.
I have known Anjali Birla since her preparation days.
Having interacted with thousands of UPSC aspirants I can confidently say that she is way too brilliant. I was shocked actually when I didn’t find her among the CSE toppers that year.Those who are questioning her merit are… https://t.co/4DXgoSZcJj
— Shah Faesal (@shahfaesal) June 29, 2024
కాలేజీలో చదువుతున్నప్పుడే UPSC ప్రిపరేషన్..
భారత 18వ లోక్‌సభ స్పీకర్‌గా (Lok Sabha Speaker) కోట ఎంపీ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో స్పీకర్ బిర్లా కుటుంబానికి సంబంధించి అనేక కథనాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అందులో ముఖ్యమైనది అంజలి బిర్లా గురించి. అంజలి ఢిల్లీ కోటలోని సోఫియా స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకుంది. దీని తరువాత అతను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రాంజాస్ కళాశాల నుండి పొలిటికల్ సైన్స్ (ఆనర్స్)లో పట్టా పొందారు. ఈ క్రమంలోనే అంజలి బిర్లా కాలేజీలో చదువుతున్నప్పుడే UPSC పరీక్షకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2019లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ పరీక్షకు హాజరవగా.. అంజలి ఇప్పటికే మొదటి ప్రయత్నంలోనే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని, దీంతో ఆమె కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నట్లు తెలిపారు.
Anjali ji is inspiration to Civil Services Aspirants.She is a very kind person too.She will come stronger after all this fake Controversy.
It’s disheartening to see how people who have done nothing in their lives attack on genuine people who have done so much in their small age.— Sociology for IAS (@AchieversIAS) June 29, 2024
UPSC మెయిన్స్ పరీక్షలో 777 మార్కులు..
అంతేకాదు అంజలి బిర్లా ఫలితాలు UPSC సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 2019 పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఫలితాలు 4 ఆగస్టు 2020న ప్రకటించబడ్డాయి. ఇందులో మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు వివరాలున్నాయి. వీరిలో 89 మంది పిల్లలు భారత ప్రభుత్వ సిబ్బంది విభాగం నుండి ఎంపికయ్యారు. అందులో స్పీకర్ ఓం బిర్లా కుమార్తె కూడా ఉంది. వారి ఫలితాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉన్నాయి. అంజలి బిర్లా UPSC మెయిన్స్ పరీక్షలో 777 మార్కులు, ఇంటర్వ్యూలో 176 మార్కులు సాధించిందని క్లారిటీ ఇచ్చారు. దీంతో నెటిజన్ల ఆరోపణలన్నీ తప్పుడేనని తేలిపోయింది.
ఇదిలా ఉంటే.. అంజలి స్పందిస్తూ ‘డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆగస్ట్ 2020లో రిజర్వ్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో OBC, EWS, SC వివిధ వర్గాల నుండి 89 మంది అభ్యర్థుల పేర్లలో నా పేరు కూడా ఉంది. నేను ఎలాంటి ఇంటర్యూలు, టెస్టులు లేకుండానే ఉద్యోగం సంపాదించానని వస్తున్న వార్తలన్నీ ఫేక్. తండ్రి రికమెండేషన్ తోనే ఐఏఎస్ అయిందనేది అవాస్తవం. ప్రోటో కాల్ ప్రకారమే నాకు ర్యాంక్ వచ్చింది. అడ్మిట్ కార్డ్ కాపీ, మెరిట్ లిస్ట్ లో రోల్ నంబర్, ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ కు అటెండ్ అయిన ప్రూఫ్స్ చూసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.