Animal Teaser: బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ (Ranbir Kapoor), నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) జంగటా నటించిన మూవీ యానిమల్. ఇంతుకు ముందు ఈ సినిమా నుంచి చిన్న ప్రీ టీజర్‌ను విడుదల చేసి ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మేకర్స్ తాజాగా ఫుల్ టీజర్‌తో సినిమా మీద అంచనాలను మరింత పెంచారు. ఈరోజు రణబీర్ పుట్టినరోజు సందర్భంగా దీన్ని విడుదల చేశారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ బేస్ గా యానిమల్‌ను తీశారని తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు దర్శకుడు సందీప్ వంగా (Sandeep Reddy Vanga) దీనిని డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ లో సందీప్ కు ఇది రెండవ సినిమా. ఇంతకు ముందు షాహిద్ కపూర్‌తో కబీర్‌సింగ్ మూవీని తీశారు. ఇది తెలుగు అర్జున్ రెడ్డికి హిందీ వెర్షన్.
యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ తండ్రిగా, రణబీర్ కొడుకుగా కనిపిస్తున్నారు. ఇది మొత్తం యాక్షన్ సినిమాగా కనిపిస్తోంది. టీజర్ లో కూడా అదే చూపించారు. దాంతో పాటూ వైలెన్స్ కూడా ఫుల్‌గా ఉండేలా కనిపిస్తోంది. టీజర్ వరకు అయితే సినిమాలో అసలు విలన్ ఎవరు అన్నది క్లారిటీగా తెలియలేదు. క్రిమినల్ కొడుకుని కన్నామని అంటూ అనిల్ కపూర్ చెప్పన డైలాగ్.. రణబీర్ వైలెన్స్‌ను ఎలివేట్ చేస్తోంది. కొన్ని చోట్ల రణ్‌బీర్ కపూర్ కూల్‌గా, సాఫ్ట్ లుక్‌లో కనిపించినప్పటికీ.. మరి కొన్ని చోట్ల వైలెంట్‌గా, వైల్డ్‌గా కనిపించాడు. రణబీర్ యాక్టింగ్ స్కిల్స్ కు యానిమల్ మూవీ ఉదాహరణగా నిలవనుంది అనిపిస్తోంది.
నన్ను ఏ విషయం గురించి అడిగినా నిజాయితీగా సమాధానం చెబుతాను. కానీ మా నాన్న గురించి మాత్రం అడగకు.. మా నాన్న ఈ ప్రపంచంలోనే బెస్ట్ ఫాదర్. నేను చెడును వెంటాడుతూ వెళ్లాను. నాకు ఎక్కడా కనపడలేదు. నాలో నేను చూసుకుంటే… నా కన్నా చెడ్డవాడు లేడు. నాన్నా ఇది ఇప్పుడే మొదలైంది. నేను వాడిని కనిపెట్టాలి, కలవాలి, చంపాలి. మీరు నిరాశ పడకండి నాన్నా అంటూ రణ్ బీర్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నారు. మరి గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన హీరో.. వైలెన్స్‌ను ఎందుకు ఎంచుకున్నాడు? అతడు ఎవరిని కనిపెట్టి చంపాలి అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ (T Series)యానిమల్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Also Read: యాక్షన్ డ్రామాలో రామ్ సెట్ అయ్యాడా? స్కంద మూవీ రివ్యూ.