స్టార్ నటి రష్మిక మందన్నాపై యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ప్రశంసలు కురిపించింది. వీరిద్దరూ రణ్ బీర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’మూవీలో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
‘నేను నిజంగానే రణ్‌బీర్ కపూర్ అభిమానిని. అయితే ఏ మూవీలోనైనా ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ‘యానిమల్’లో రష్మికతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆమె చాలా టాలెంటెండ్. మొదటిరోజు సెట్‌కు వెళ్లగానే ఆమె నన్ను పలకరించింది. ఆప్యాయంగా స్వాగతం పలికింది. కొత్త వాతావరణంలో నేను ఇబ్బంది పడ్డాను. అది గమనించిన రష్మిక నాతో మరింత స్నేహంగా ఉంది. అది అందరిలో ఉండాల్సిన మంచి లక్షణం. ఇక నేను రణ్‌బీర్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూశాను. ‘యానిమల్’తో నాకల నెరవేరింది. సెట్లో రణ్‌బీర్‌ను చూస్తూ విగ్రహంలా ఉండిపోయేదాన్ని. ఆయన చాలా మంచి నటుడు. ‘యానిమల్’కు ఓకే చెప్పడానికి రణ్‌బీర్ కూడా ఓ కారణం’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి : Telangana Ration Cards: కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఫామ్ ఇవే..!
ఈ చిత్రంలో రష్మిక గీతాంజలి పాత్రలో నటించగా.. జోయాగా త్రిప్తి డిమ్రీ కనిపించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రణ్‌బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకోగా.. మంచి వసూళ్లు సాధించి ఈ ఏడాది హిట్ చిత్రాల లిస్ట్‌లో చేరింది.