Anil Ravi Pudi: యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. తక్కువ సమయంలో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఫ్లాప్ లేని పర్ఫెక్ట్ డైరెక్టర్ అనిల్ రావి పూడి అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు.
తెలుగు ఇండీస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు అనిల్ రావి పూడి. అయితే ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ మెగా స్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన కథను మెగా స్టార్ కు వినిపించడం.. కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిందని అంటున్నారు.
ప్రజెంట్ మెగా స్టార్ యువీ క్రియేషన్స్ బ్యానర్ పై బింబిసార డైరెక్టర్ శ్రీవశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమా ఫాంటసీ, అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఆ తర్వాత చిరంజీవి అనిల్ రావి పూడి సినిమా చేయనున్నారని బలంగా టాక్ వినిపిస్తోంది. ఈ గ్యాప్ లో అనిల్ రావి పూడి మాస్ మహారాజ్ రవితేజ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ‘రాజా ది గ్రేట్’ మూవీ సీక్వెల్ స్రిప్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Trisha : ‘యానిమల్’ పై త్రిష పోస్ట్.. నెట్టింట్లో వైరల్ ..!
Also Read: Allari Naresh: రవితేజ బాటలో.. అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’..!