AP Violence : ఏపీ (Andhra Pradesh) లో అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. తిరుపతి మహిళావర్సిటీ (Tirupati Women’s University) స్ట్రాంగ్ రూం దగ్గర జరిగిన ఘటనపై సిట్ బృందం అధికారులను విచారిస్తున్నారు. ఈ బృందంలోని డీఎస్పీ రవి మనోహరాచారి, ఇన్స్పెక్టర్ మురళీధర్‌లు ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన FIRలపై విచారణ చేస్తున్నారు.
Also Read: సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే డేట్, ప్లేస్ ఇదే.. వైసీపీ సంచలన ప్రకటన!
ఈ నెల 14న వర్సిటీ స్ట్రాంగ్ రూం దగ్గర టీడీపీ (TDP) అభ్యర్థి నానిపై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. తిరుపతి ఎస్పీతో పాటు నలుగురు అధికారులపై వేటు వేసింది. ఈ క్రమంలోనే హింసపై ఈసీ.. సిట్‌ను నియమించింది. రేపటికల్లా సిట్ తమ నివేదికను సమర్పించనుంది.
Also read: అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు