CM Chandrababu Naidu: విజయవాడలో (Vijayawada) వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పెనుప్రమాదం తప్పింది. ఆయన పర్యటిస్తున్న బోటు ఒక్కసారిగా పక్కకి ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది..బోటును తిరిగి యథాస్థితికి తీసుకుని వచ్చారు. ఆయన పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరద ముంపు ప్రాంతాల్లో ఆయన అర్థరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పర్యటించారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాబు వెంట ఉన్నతాధికారులతో పాటు…మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సూచనలిస్తున్నారు.
Also Read: మరికొన్ని రైళ్లు రద్దు…రత్నాచల్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు!