YSRCP Second List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి రెండో విడత అభ్యర్థుల వివరాలను విడుదల చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ సెకండ్ లిస్ట్‌ను విడుదల చేశారు. ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు పార్టీ అధినేత జగన్. ఈ క్రమంలోనే మంగళవారం నాడు సీఎం క్యాంపు ఆఫీసులో పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపిన సీఎం జగన్.. 27 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ఖరారు చేశారు. సీఎంతో సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గాల ఇన్ చార్జిలకు సంబంధించిన సెకండ్ లిస్ట్ విడుదల చేశారు.
వైసీపీ విడుదల చేసిన సెకండ్ లిస్ట్ అభ్యర్థులు వీరే..
👉 అనంతపురం ఎంపీ – మాలగుండ్ల శంకరనారాయణ
👉 హిందూపురం ఎంపీ – జోలదరాశి శాంత
👉 అరకు ఎంపీ (ఎస్టీ) – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
👉 రాజాం (ఎస్సీ) – తాలె రాజేష్
👉 అనకాపల్లి – మలసాల భరత్ కుమార్
👉 పాయకరావుపేట (ఎస్సీ) – కంబాల జోగులు
👉 రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాష్
👉 పి.గన్నవరం (ఎస్సీ) – విప్పర్తి వేణుగోపాల్
👉 పిఠాపురం – వంగ గీత
👉 జగ్గంపేట – తోట నరసింహం
👉 ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
👉 రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
👉 రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
👉 పోలవరం (ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మి
👉 తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
👉 గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా
👉 మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
👉 చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
👉 పెనుకొండ – కె.వి. ఉషా శ్రీచరణ్
👉 కళ్యాణదుర్గం – తలారి రంగయ్య
👉 అరకు (ఎస్టీ) – గొడ్డేటి మాధవి
👉 పాడేరు (ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
👉 విజయవాడ సెంట్రల్ – వెలంపల్లి శ్రీనివాస రావు
👉 విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్
YSRCP Team 2024 💥
Second set is released ✅#JaganannaOnceMore #JaiYSRCP pic.twitter.com/Bcbgp24lz5
— Jagan Squad (@JaganSquad) January 2, 2024
Also Read:
హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు.. ఇదిగో వీడియోలు!