Ananya pande: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యాపాండే (Ananyapande) తన రూమర్ బాయ్ ఫ్రెండ్ ఆదిత్యరాయ్ కపూర్ (Aditya Roy Kapur) పై ప్రశంసలు కురిపించింది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ జోడీ పలుసార్లు జంటగా తిరుగుతూ కెమెరాల కంట చిక్కడంతో డేటింగ్ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే ఈ ప్రేమ వ్యవహారంపై అన్యన్య, ఆదిత్యరాయ్ లు ఎప్పుడూ స్పందించకపోవడం విశేషం. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య.. ఆదిత్యను తెగ పోగిడేసింది.
Worry less, Move more!
With @SkechersIndia Apparel! 🤸 @skechersGOin#Skechersindia #SkechersApparel #Comfort #ApparelTech #Move #SkechersAmbassador #Ad pic.twitter.com/9NiAVSqeiw
— Ananya Panday (@ananyapandayy) January 5, 2024
ఏమీ దాచుకోడు..
ఈ మేరకు ఆదిత్యారాయ్ తనలో ఏ విషయం దాచుకోవడానికి ప్రయత్నించడని, తనతో అన్ని షేర్ చేసుకుంటాడని చెప్పింది. ‘అతనిలో నాకు నచ్చే గుణాలలు చాలా ఉన్నాయి. ఆదిత్య చాలా ఓపికగా ఉంటాడు. ‘ఆషికీ 2’ తర్వాత తనకి చాలా అవకాశాలొచ్చాయి. కానీ వేటినీ తొందరపడి ఒప్పుకోలేదు. అతడికి నచ్చే ప్రాజెక్టు వచ్చే దాకా ఎదురు చూశాడు. ఒక్కసారి ఒప్పుకున్నాక ఆ పాత్రతో ప్రేమలో పడిపోతాడు. వందశాతం మనసు పెట్టి పని చేస్తాడు. ఎంత ఆలస్యమైనా సరే.. పరిశ్రమ నుంచి వచ్చే ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగడు’ అంటూ ప్రశంసలు కురిపించింది.
And dis is how @AdityaRoyKapoor decided to come for the special screening of #HaseeTohPhasee pic.twitter.com/H3i6VT3R1E
— HT City (@htcity) February 3, 2014
ఇది కూడా చదవండి : Kangana: అవును నేను ప్రేమలో ఉన్నాను.. కానీ అతనికి పెళ్లైంది: కంగన
ఆ ఆరాటం లేదు..
అలాగే తనలాగే అతను కూడా ఆదరాబాదరాగా ఒప్పుకొని, ఒకేసారి నాలుగైదు సినిమాల్లో కనపడాలనే ఆతృత అతడికేమాత్రం ఉండదని తెలిపింది. తనపై తాను నమ్మకం ఉంచుకొని నచ్చే కథ దొరికేవరకు ఎంతో ఓపిగ్గా ఉంటాడుని వెల్లడించింది. ఇక అనన్య చివరిసారిగా సిద్ధాంత్ చతుర్వేది తెరకెక్కించిన ‘ఖోగయే హమ్ కహా’లో కనిపించింది.