Anant-Radhika Pre Wedding : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ..రాధికా మర్చంట్ ను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుక గుజరాత్ లోని జామ్ నగర్ లో జరగనుంది. అయితే నేటి నుంచి జరగనున్న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ అమెరికన్, బర్బాడియన్ పాప్ స్టార్ రిహన్నా షో చేయనుంది. తన ఫర్మార్మెస్ కోసం రిహాన్నా సుమారు 9 మిలియన్ల డాలర్ల రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంటే ఆ సింగర్ దాదాపు 75కోట్లు వసూల్ చేస్తున్నట్లు. యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్ ల్యాండ్ టైటిల్ తో ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తున్నారు.
కాగా రిహాన్నా ఫిబ్రవరి 29 వతేదీనే జామ్ నగర్ కు చేరుకుంది. తమ ట్రూప్ తో ఆమె ఈవెంట్ ప్రదేశానికి చేరింది. తన ఆల్బమ్ లోని హిట్ సాంగ్స్ ను రిహాన్నా పాడునున్నట్లు తెలుస్తోంది.దీనికోసం ఆమె భారీ సెట్ వేస్తున్నట్లు వినిపిస్తోంది. స్టేజ్ ఎక్విప్మెంట్, డ్రెస్సులు, బ్యాక్ గ్రౌండ్, సింగర్లకే భారీ గా ఖర్చు అవుతుందట.
నేటి ఈవెంట్లో సింగర్ రిహాన్నాతో పాటు దిల్జిత్ దోసంజ్ కూడా స్టేజ్ షో ఇవ్వునున్నట్లు తెలుస్తోంది ప్రపంచ ప్రఖ్యాత ఇల్యూజనిస్ట్ డేవిడ్ బ్లెయిన్ కూడా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో పర్ఫార్మ్ చేస్తున్నారట. బాలీవుడ్ స్టార్స్ షారూక్, దీపికా, రణ్వీర్, ఆలియా, రణ్‌బీర్, అర్జున్ కపూర్ ఈ వేడుకకు హాజరువుతున్నారు.
అటు రిహన్న లగేజీ జామ్‌నగర్‌లో లగేజీ మేళా నిర్వహించింది. ఒకటి కాదు రెండు మూడు ట్రక్కుల్లో, పెద్ద కంటైనర్లలో ప్యాక్ చేసిన రిహానా లగేజీని తీయడానికి ప్రత్యేక క్యారియర్‌ను పిలిచారట.రిహాన్న లగేజీకి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
ఈ రిహాన్నా జామ్ నగర్ లోనే సెటిల్ అవుతున్నారా అంటూ కామెంట్స్ చేశారు. జామ్‌నగర్‌లో రిహార్సల్ చేస్తూ కనిపించారు రిహాన్నా. ఆమె ‘డైమండ్’, ‘ఆల్ ఆఫ్ ది లైట్స్’లో రిహార్సల్ చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Rihanna’s luggage has arrived in India 👀
pic.twitter.com/h4SLE5T8QJ— 🌙 (@navybih) February 29, 2024
రాధిక అనంత్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో రాజకీయ నాయకుల నుండి బడా వ్యాపారవేత్తల వరకు, ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది ప్రముఖ వ్యక్తులు జామ్ నగర్ కు చేరుకుంటున్నారు. రాధిక, అనంత్‌ల పెళ్లిలో బాలీవుడ్ ప్రముఖులు కూడా సందడి చేయనున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, విక్కీ కౌశల్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, మానుషీ చిల్లార్, జాన్వీ కపూర్ సహా పలువురు తారలు జామ్‌నగర్ చేరుకున్నారు.
మార్చి 1 నుంచి 3 వరకు జామ్‌నగర్‌లో రాధిక, అనంత్‌ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరగనున్నాయి. 2024 జూలై 12న ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ జంట 2022లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది..సోషల్ స్టడీస్ ఇలా ప్రిపేర్ అవుతే జాబ్ గ్యారెంటీ!