హైదరాబాద్ లో విషాదం నెలకొంది. హస్తినాపురంలో అర్థరాత్రి అంబులెన్స్ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. అంబులెన్స్ బోల్తాపడగానే…అందులో ఉన్న ఆక్సీజన్ సిలిండర్ పేలింది. దీంతో డ్రైవర్ మంటల్లో కాలిపోయాడు. అంబులెన్స్ పూర్తిగా దగ్దమయ్యింది. ఈ అంబులెన్స్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందినదిగా సమాచారం.
పూర్తి వివరాల ప్రకారం…మలక్ పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పేషంట్ ను తీసుకుని వేరే ఆసుపత్రిలో దించారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా బీఎన్ రెడ్డి నగర్ దగ్గర డివైడర్ ను అంబులెన్స్ బలంగా ఢీకొట్టి…బోల్తా పడింది. అంబులెన్స్ ను పైకి లేపుతుండగా అందులో ఉన్న ఆక్సీజన్ సిలిండర్ పేలింది. దీంతో డ్రైవర్ మల్లేష్ మంటల్లో చిక్కుకుని అక్కడిక్కడే మరణించాడు. అంబులెన్స్ ఖాళి బూడిదైంది. సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఘటనాస్థలంలో ఉన్న పోలీసులకు,గాయాలయ్యాయి. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.