Kohli Fans Threat Call To Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు రావడం కలకలం రేపాయి. రాయుడి భార్య, కూతుళ్లను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఐపీఎల్లో కోహ్లీ, ఆర్సీబీపై (RCB) అంబటి విమర్శలు చేశారు. ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ టైటిల్ తెచ్చిపెట్టదని..ప్లే ఆఫ్ చేరితేనే.. టైటిల్ గెలిచినట్టు సంబరాలు చేసుకున్నారంటూ కోహ్లీపై అంబటి సెటైర్లు వేశారు. కోహ్లీ, ఆర్సీబీపై కామెంట్స్‌తో అంబటిని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. అంబటి రాయుడిని (Ambati Rayudu) తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బెదిరింపులపై ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు అంబటి స్నేహితుడు సామ్పాల్. అంబటి కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉందంటూ వెల్లడించాడు. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.