Minister Ambati Rambabu : రాజకీయాల్లో బిజీగా ఉండే మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) సంక్రాంతి(Sankranti) సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా సతైనపల్లి(Sattenapalle) లో అంగరంగవైభవంగా సంబరాలు జరుగుతున్నాయి. సంబరాలు పాల్గొన్నారు మంత్రి అంబటి రాంబాబు. బోగి(Bogi) మంటలు వేసిన మంత్రి అంబటి.. డ్యాన్స్ వేసి సంక్రాంతి పండుగకు ఇంకా కొంత బూస్ట్ అందించారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి కోసం ప్రత్యేకంగా తన పేరుతో పాటలు రాయించుకున్నట్లు తెలిపారు. గతంలో డ్యాన్స్ వేస్తే సంబరాలు రాంబాబు అని విమర్శించారని అన్నారు. అందుకే సంబరాలు రాంబాబు అనే పేరుతో పాట రాయించానని తెలిపారు. సంక్రాంతి వస్తే నేను సంబరాలు రాంబాబునే అని.. సంక్రాంతి ముగిసిన తర్వాత అసలైన రాజకీయ నాయకుడునని అన్నారు.
గత ఏడాది జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులేశారు. అయితే.. దీనిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు మంత్రి అంబటి రాంబాబుకు సంబరాల రాంబాబు అనే నామకరణం చేశాయి. ఒక ప్రెస్ మీట్ లో జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మంత్రి అంబటి రాంబాబు పై విమర్శల దాడికి దిగారు. మంత్రి అంబటి ప్రజల సమస్యలు పట్టించుకోరని.. వారికి కేవలం సంబరాలు కావాలని.. అతను అంబటి రాంబాబు కాదు సంబరాల రాంబాబు అని ఎద్దేవా చేశారు. ఆరోజు నుంచి అంబటి రాంబాబు కాస్త సెటైరికల్ గా సంబరాల రాంబాబు గా మారింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో కూడా మంత్రి అంబటి రాంబాబు ను ఉద్దేశిస్తూ ఓ సీన్ కూడా పెట్టారు. ఆ సీన్లో సంబరాలు రాంబాబు అని పేరు పెట్టారు. అప్పుడు ఆ సినిమాలో ఉన్న సీన్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఏదిఏమైనా ప్రజలను ఆకట్టు కునే విషయంలో అంబటి రాంబాబు ఎప్పుడు ముందుంటారనే చెప్పాలి.
ఆట్ …. ఇదీ పండగ సందడంటే🕺🏽🕺🏽@AmbatiRambabu గారు ON FIRE #HappyBhogi pic.twitter.com/f1VDl7i7w4
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) January 14, 2024
Also Read : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్