Aloo Baingan Chokha: బీహార్‌లో తయారైన లిట్టిని(పిండి పదార్థం) బంగాళదుంప-వంకాయ చోఖాతో వడ్డిస్తారు. ఈ చోఖాను రోటీ లేదా పరాఠాతో కూడా తినవచ్చు. చాలా త్వరగా తయారు చేసుకునే ఈ రెసిపీ రుచిలో కాస్త స్పైసీగా ఉంటుంది. స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం ఉండే వారికి ఇది అద్భుతంగా నచ్చుతుంది. బెంగాలీ ఆలూ చోఖాను బీహారీ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము..
ఆలూ బైంగన్ చోఖా చేయడానికి కావాల్సిన పదార్థాలు
- వంకాయ
- బంగాళదుంపలు
- సన్నగా తరిగిన ఉల్లిపాయ
- సన్నగా తరిగిన టొమాటోలు
- తురిమిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి
- నిమ్మకాయ
- ఆవాల నూనె
- ఉప్పు సరిపడ
- ఎర్ర మిరపకాయలు
- పచ్చి కొత్తిమీర
ఆలూ బైంగన్ చోఖా తయారీ విధానం
- బంగాళాదుంప-బ్రింజాల్ చోఖా చేయడానికి, ముందుగా వంకాయను కడిగి తుడిచి, ఒక ప్రక్క నుంచి కొద్దిగా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు వాటికి నూనె లేదా నెయ్యి రాసి గ్యాస్‌పై వేయించాలి. దీనితో పాటు, బంగాళాదుంపలను కూడా ఉడికించి పెట్టుకోవాలి.
- వంకాయను కాల్చేటప్పుడు, అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే అన్ని వైపుల నుంచి బాగా కాల్చబడుతుంది.
- ఆ తర్వాత వంకాయ పై తొక్క తీసి శుభ్రం చేయాలి. మరో వైపు ఉడికించిన బంగాళదుంపల తొక్కలను కూడా తొలగించాలి. తర్వాత వేయించిన వంకాయలు , ఉడికించిన బంగాళదుంపలను ఒక పాత్రలో వేసి మెత్తగా చేసుకోవాలి.
- ఇప్పుడు తరిగిన టొమాటో, ఉల్లిపాయ, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తరవాత వెల్లుల్లి రెబ్బలు , ఎర్ర మిరపకాయలను మంట మీద వేయించి వాటిని బాగా నలగగొట్టి అన్నింటినీ బాగా కలపాలి.
- చివరగా కొద్దిగా ఆవాల నూనె వేసి కలపాలి. అంతే ఆలూ బైంగన్ చోఖా రెడీ. పచ్చి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
Also Read: Sweating: వేసవిలో చెమట వాసన ఎక్కువైందా..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి