Telangana: భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణ కారణంగా ఓ విద్యార్థి చనిపోయాడు. ఈ మేరకు పాల్వంచ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అల్లూరి విష్ణు (22) అనే విద్యార్థిపై అదే కాలేజికి చెందిన ఇంటర్ స్టూడెంట్స్ మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. విష్ణు ప్రైవేట్ భాగాలపై దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి చేరగానే అతని స్నేహితులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పడికే మృతిచెందినట్లు వైద్యాధికారులు నిర్థారించారు. సుమారు ఇరవై మంది విద్యార్థులు విష్ణుపై దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. వారంతా మత్తులోనే విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. మృతిచెందిన విద్యార్థి స్వస్థలం పాల్వంచ మండలం యానంబైల్ గ్రామంగా గుర్తించిన పోలీసులు ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.