Allu Arjun And His Wife Spotted At Dhaba : ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) రేంజ్ మారిపోయింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీతో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ తో పాటూ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఐకాన్ స్టార్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం సినీ లవర్స్ అంతా ‘పుష్ప 2’ (Pushpa 2) కోసం వెయిట్ చేస్తున్నారు. ‘పుష్ప’ తర్వాత బన్నీ బయట ఎక్కడ కనిపించినా ఆ ప్లేస్ అంతా జన సంద్రంగా మారుతూ ఉంటుంది. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైపోయింది. అయితే తాజాగా బన్నీకి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
దాబాలో లంచ్ చేసిన బన్నీ,స్నేహా
ఇటీవల అల్లు అర్జున్ ఎన్నికల్లో నిలబడ్డ తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేసేందుకు నంద్యాల (Nandyala) వెళ్లిన విషయం తెలిసిందే కదా. అయితే అక్కడి నుంచి తిరిగొచ్చే క్రమంలో బన్నీ తన భార్య స్నేహాతో కలిసి ఓ మాములు దాబాలో లంచ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా (Social Media) లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ బన్నీ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.
Also Read : నటి హేమ కొత్త వీడియో.. ఇదంతా కవరింగే అంటూ ట్రోలింగ్..!
పాన్ ఇండియా స్టార్ అయ్యుండి కూడా ఒక మాములు దాబాలో బన్నీ ఇలా భోజనం చేయడం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో ఈ ఫోటోను ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రెజెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల కానుంది.
#Pushpa in Dhaba! 🥰
Truly heart-warming! ❤️Icon Star #AlluArjun and his wife #AlluSnehaReddy were seen dining at a dhaba, showing his humble side. 🫰🫶#PushpaTheRule #PushpaRaj #Ragalahari pic.twitter.com/ZVfjJBzd0H
— Ragalahari (@Ragalahariteam) May 21, 2024