Taraka Ratna Wife’s Alekhya Reddy Birthday Celebrations : నటుడు, రాజకీయ నేత తారకరత్న (Taraka Ratna) మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి (Alekhya Reddy) కి అండగా నిలిచిన వారిలో వైఎస్ షర్మిల (YS Sharmila) ముందు వరుసలో ఉన్నారు. అలేఖ్య రెడ్డికి వైసీపీ ప్రముఖులతో మంచి సాన్నిహిత్యం ఉంది. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీ అలేఖ్యకు బంధువులు అవుతారు. అయితే తాజాగా అలేఖ్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వై ఎస్ షర్మిల దగ్గరుండి అలేఖ్య బర్త్ డేని సెలబ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షర్మిల అలేఖ్యకు అక్క వరుస అవుతుంది. ఇందులో భాగంగా అలేఖ్యను తన సోదరిలా చూసుకుంటున్న షర్మిల.. ఆమె పుట్టినరోజును చాలా ప్రేమగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అలేఖ్య ఎమోషనల్ అవుతూ, షర్మిలను హత్తుకున్న వీడియో నెటిజన్స్ చేత కంటతడి పెట్టిస్తోంది. స్వయంగా అలేఖ్య తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
Also Read : ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి మెగాస్టార్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
” గత కొన్నేళ్లుగా నా పక్కన ఉంటావు అని చేసిన ప్రామిస్ ని నువ్వు నిలబెట్టుకుంటున్నావు అక్క. నా కోసం టైం ఇచ్చి నా బర్త్ డే ని సెలెబ్రేట్ చేసినందుకు ధన్యవాదాలు. నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నువ్వు చేసే చిన్న పని కూడా నాకు బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది. నువ్వు నాకెంత స్పెషల్ అనేది నేను చెప్పలేను. నీ స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు అక్క. లవ్ యు షర్మిల అక్క” అంటూ తన పోస్ట్ లో పేర్కొంది.
View this post on Instagram