Akaay AI Photos: ఫిబ్రవరి 15వ తేదీన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క (Anushka) దంపతులు రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. వీరు పండంటి మగబిడ్డకు జన్యనిచ్చారు. పిల్లాడికి అకాయ్ అని పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని విరాటే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు కూడా. అయితే ఎక్కడా కుమారుడి ఫోటోలు మాత్రం బయటపెట్టాలేదు. ఈ విషయంలో కోహ్లీ, అనుష్కలు ఇద్దరూ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. వీరి మొదటి సంతానం వామికా ఫోటోను కూడా ఇప్పటి వరకు ఎవ్వరికీ చూపించలేదు. పబ్లిక్ ప్లేస్ల్లో కూడా ఆమెను తీసుకురాలేదు. ఇప్పుడు అకాయ్ విషయంలోనే ఇదే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అకాయ్ ఏఐ ఫోటోలు…
అయితే విరాట్ కోహ్లీ అభిమానుల మాత్రం ఎప్పటిలానే అకాయ్ ఫోటోలు చూడ్డానికి తెగ ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ క్రమంలో విరాట్ దంపతులు ఎలాగో పిల్లాడిని చూపించరు కదా అని..ఓ అడుగు ముందుకేసి ఏఐ సాయంతో ఫోటోలను క్రియేట్ చేసేశారు. కోహ్లీ, అకాయ్ కలిసి ఉన్న ఫోటోలు…మొత్తం ఫ్యామిలీ ఉన్న ఫిక్స్‌ను క్రియేట్ చేశారు. ఇందులో విరాట్, అకాయ్లు ఇద్దరూ ఙండియా జెర్సీ వేసుకున్న ఫోటో కూడా ఉంది.
AI images of akaay ❤️🔥#akaaykohli#Akaay#AnushkaSharma #ViratKohli pic.twitter.com/cre7GGmvna
— kikuuuuuu (@MemeCreatorrr) February 21, 2024
A cute ai generated family photo of Virushka
💖😍#Akaay #akaaykohli #ViratKohli #AnushkaSharma #Vamika pic.twitter.com/zq63tXinNM— ꧁Priyanshu꧁ (@Hey_ImPriyanshu) February 21, 2024
ఐపీఎల్‌కూ విరాట్ డౌటే…
విరాట్, అనుష్కలు తమ కుమారుడు అకాయ్‌కు (Akaay) లండన్‌లో జన్మనిచ్చారు. ఈ కారణంగానే విరాట్ లండన్ టెస్ట్ సీరీస్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్-2024 ఫస్ట్ సీజ్‌కు కూడా దూరంగా ఉండనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ భార్య అనుష్క సెకండ్ డెలివరీ సవ్యంగా సాగలేదని…ఏవో అనారోగ్య సమస్యలున్న కారణంగానే డెలివరీకి లండన్ వెళ్ళారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విరాట్, అనుష్కలు మరికొంత కాలం లండన్‌లోనే ఉండనున్నారని…అందుకే కోహ్లీ ఐపీఎల్ ఫస్ట్ సీజన్‌కు హాజరు కాపోవచ్చని చెబుతున్నారు. అయితే దీని మీద ఆర్సీబీ కానీ, విరాట్ కోహ్లీ కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇక ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం అవనుందని తెలుస్తోంది.