Ajith Kumar – Trisha : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అజిత్ కెరీర్ లో 63 వ ప్రాజెక్ట్ గా ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీతో పాటూ అజిత్ తన 62 వ సినిమా ‘విధాముయార్చి’ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే అజిత్ 63 వ సినిమాలోనూ త్రిషనే హీరోయిన్ గా ఫైనల్ అయిందట.
ఇప్పటికే ఈ జంట అయిదు సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు ఆరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు తెలిసింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తాజా సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : ‘టిల్లు’ గాడు టీవీల్లోకి వచ్చేస్తున్నాడు.. ‘టిల్లు స్క్వేర్’ టీవీ ప్రీమియర్ డేట్ ఇదే..!
ఒకవేళ ఇదే నిజమైతే అజిత్‌కుమార్ త్రిష- కలయికలో ఇది డబుల్ హ్యాట్రిక్ మూవీ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.