Amaravathi: టీడీపీ – జనసేన కూటమితో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ- జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అత్తి సత్యనారాయణలు అన్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా తాడేపల్లిగూడెం ప్రత్తిపాడులో జరిగిన టీడీపీ – జనసేన కూటమి మొదటి బహిరంగ సభకు రాజమహేంద్రవరం సిటి నియోజకవర్గం నుంచి టీడీపీ – జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వెళ్లారు. 100 కార్లు, 1000 బైకులపై సుమారు 5000 వేల మంది ర్యాలీగా వెళ్లారు.
ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు..
ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అదికూడా టీడీపీ – జనసేన పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. జగన్ కోరిక మేరకు వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తాము ర్యాలీగా వెళుతుంటే ప్రజలు ఎవరికి వారు స్వచ్చందంగా బయటకు వచ్చి స్వాగతం పలుకుతున్నారని, రాష్ట్రంలో జగన్.. రాజమండ్రిలో భరత్ రామ్ క్లోజ్ అన్నారు.
ఇది కూడా చదవండి : Dairy Milk: క్యాడ్బరీ డైరీమిల్క్ చాలా ప్రమాదం.. నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ!
ఉమామార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్, వైసీపీ నాయకులు యిన్నమూరి ప్రదీప్ తాడేపల్లిగూడెంలో చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ సమక్షంలో టీడీపీలో చేరుబోతున్నట్లు చెప్పారు. వైసీపీ విధానాలు నచ్చక, ముఖ్యంగా ఎంపీ భరత్ రామ్ విధానాలపై విరక్తి వచ్చి యిన్నమూరి దీపు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారని పేర్కొన్నారు.