Adire Abhi Interview : బుల్లితెర కామెడీ షోతో భారీ పాపులారిటీ సంపాదించుకొని ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న కమెడియన్స్ చాలామందే ఉన్నారు. ఇక కొందరైతే హీరోలుగా మారి వరుస సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో అదిరే అభి కూడా ఒకరు. జబర్దస్త్ షో స్టార్ట్ అయినప్పుడు కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన అభి ఎన్నో రకాల స్కిట్స్ తో ఆడియన్స్ ని నవ్వించాడు.
మొన్నటి వరకు టీవీ షోలలో కమెడియన్ గా కొనసాగి..ఇప్పుడు హీరోగా మారి వరుస సినిమాలు చేస్తున్నాడు. జబర్దస్త్ లో ఉన్నంత కాలం టాప్ కమెడియన్స్ ఫైనాన్షియల్ గా బాగానే సెట్ అయ్యారని చాలామంది అంటుంటారు. కానీ అది నిజం కాదని అంటున్నాడు మన అభి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభి జబర్డస్త్ లో ఇచ్చే రెమ్యునరేషన్స్ గురించి నోరు విప్పుతూ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.
Also Read : ఓటు వేసేందుకు వచ్చి అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!
జబర్దస్త్ లో రెమ్యునరేషన్స్ తక్కువే
జబర్దస్త్ కమెడియన్స్ కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని అందరూ అంటుంటారు. నిజంగా ఆ షోలో అంత రెమ్యునరేషన్ ఇస్తారా? అని తాజా ఇంటర్వ్యూలో అభిని యాంకర్ అడిగారు. అందుకు అభి బదులిస్తూ..” నేనైతే జబర్దస్త్ కి రాకముందే ఇళ్ళు,కారు కొనుక్కున్నా. నిజానికి జబర్దస్త్ లో వచ్చే రెమ్యునరేషన్ తక్కువే. జబర్దస్త్ వల్ల కోట్లు సంపాదించారనేది కరెక్ట్ కాదు.
జబర్దస్త్ వల్ల ఫేమ్ వచ్చింది నిజం. దాన్ని యూజ్ చేసుకొని చాలామంది కమెడియన్లు బయట ప్రైవేట్ షోలు చేశారు. రాత్రుళ్ళు బయట షోలు చేసి నిద్ర లేకుండా జబర్దస్త్ లో పాల్గొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రైవేట్ షోల వల్ల పేమెంట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడున్న కమెడియన్స్ అంతా ఆస్తులు సంపాదించింది ఇలాంటి ప్రైవేట్ షోలు, ఈవెంట్స్ వల్లే ” అని చెప్పాడు.