Tamil Actress Vijaya Lakshmi Selfie Video Viral: నటి విజయలక్ష్మి షేర్ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మార్చి 5న ఆత్మహత్య చేసుకోబోతున్నాను అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది. పెళ్లి పేరుతో తమిళ కట్చి నేత సీమాన్ (Katchi Leader Seeman) తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఆమె రిలీజ్ చేసిన వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం ..
నటి విజయలక్ష్మి సెల్ఫీ వీడియో
మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 29న తమిళ కట్చి సమన్వయకర్త సీమాన్ నాతో కలిసి మాట్లాడాలని, కలిసి జీవితం పంచుకోవాలని ఎంతో ఆవేదనతో వీడియో చేసి తనకు పంపించాను. అంతే కాదు ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పాను. ఇప్పటికీ ఐదు రోజులు పూర్తయింది.. తన నుంచి ఎలాంటి స్పందన లేదు. పెళ్లి పేరుతో నాతో మూడేళ్ళ పాటు రహస్య జీవితాన్ని గడిపారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మొహం చాటేస్తున్నారు. నా జీవితాన్ని సీమాన్ నాశనం చేశారు. నన్ను నడి రోడ్డు పై వదిలేశారు.
ప్రస్తుతం నేను కర్ణాటకలో జీవించలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మానవత్వం తో ఎవరైనా సహకరించినా .. వారిని తరిమి కొడుతున్నారు. ఇదే నా చివరి వీడియో. నేను ఆత్మహత్య (Suicide) చేసుకోబోతున్నాను అంటూ నటి విజయలక్ష్మి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది.
View this post on Instagram