Actress Vedika in Yakshini Web Series : మలయాళ బ్యూటీ వేదిక టాలీవుడ్ లో ముని, బాణం, వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. తెలుగులో అంతగా సక్సెస్ అవ్వలేదు కానీ మలయాళ, తమిళ్ సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చ్చుకుంది. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో బాలకృష్ణ రూలర్, కాంచన 3 సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం తన సెకెండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలు అందుకుంటున్న ఈ హీరోయిన్ ఇటీవల వచ్చిన ‘రజాకార్’ సినిమాలో అద్భుత నటన కనబర్చింది.
ఇక తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇస్తూ ‘యక్షిణి’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. బాహుబలి మేకర్లైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా అధినేత ప్రసాద్ దేవినేని ఈ సిరీస్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌తో మరోసారి వేదిక తన నట విశ్వరూపాన్ని చూపించారు. అర్జున ఫల్గుణ, జోహార్, కోటబొమ్మాలి పీఎస్ వంటి చిత్రాలను తీసిన తేజ మర్ని ‘యక్షిణి’ని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌లో యక్షిణిగా వేదిక కనిపించి మెప్పించారు.
Also Read : కల్కికి టికెట్ల రేటు పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
ఇది వరకు వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రాలకు భిన్నంగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతోంది. యక్షిణి టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ యక్షిణి జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ యక్షిణి ఇప్పుడు హాట్ స్టార్‌లో ట్రెండ్ అవుతోంది. సోషియా ఫాంటసీ సినిమాలను ఇష్టపడేవారికి ‘యక్షిణి’ బెస్ట్ ఆప్షన్.