Rare Honor To Late Actress Sridevi : భారతీయ సినీ పరిశ్రమ(Cine Industry) లో తన అందం,అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి(Sri Devi). చెన్నై లో పుట్టిన శ్రీదేవి తెలుగులో తిరుగులేని స్టార్ డం అందుకుంది. ఆ తర్వాత తమిళ , మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
బాలీవుడ్(Bollywood) నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్న ఆమె 2018 ఫిబ్రవరి 24 న మరణించింది. ఆమె మరణించి సుమారు ఆరేళ్ళు అవుతున్నా అభిమానులు ఏదో ఒక సందర్భంలో ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా శ్రీదేవికి ఓ అరుదైన గౌరవం దక్కింది.
Also Read : వైసీపీ అభ్యర్థి ఇంట్లో అల్లు అర్జున్.. రచ్చ..రచ్చ చేస్తున్న అభిమానులు..!
ముంబై లోని ఓ ఏరియాకి శ్రీదేవి పేరు
తాజాగా ముంబై లోని అంధేరి ప్రాంతంలో ఉన్న లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కి అక్కడి ప్రజలు ‘శ్రీదేవి కపూర్ చౌక్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ స్వయంగా వెల్లడించింది. శ్రీదేవి బోనీ కపూర్ తో పాటూ వారి పిల్లలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇంతకు ముందు ఇదే ఏరియాలో ఉండేవారని, శ్రీదేవి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యారని, అందుకే శ్రీదేవి గుర్తుగా ఆ ఏరియాకి ఆమె పేరు పెట్టినట్లు అక్కడి స్థానిక ప్రజలు తెలిపారు. శ్రీదేవికి ఇలాంటి అరుదైన ఘనత దక్కడం పట్ల ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ మరోసారి తమా అభిమాన నటిని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు.
Honour To Eternal #Sridevi !!
A junction in the Lokhandwala Complex locality of Andheri, Bombay has been named Sreedevi Kapoor Chowk. @BoneyKapoor
The chowk is on the same road on which the late actress lived with husband Boney Kapoor and her two daughters, Janhvi and Khushi,… pic.twitter.com/glhSHl7xRz
— BA Raju’s Team (@baraju_SuperHit) May 10, 2024