Surekha vani: నటి సురేఖ వాణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్రలోనైనా పర్ఫెక్ట్ గా ఒదిగిపోయే వారిలో ఒకరు సురేఖ వాణి. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. తన కూతురితో కలిసి సురేఖ వాణి చేసే వీడియోలో నెట్టింట్లో బాగా వైరలవుతుంటాయి. తనంత కూతురు ఉన్నప్పటికీ సురేఖ యంగ్ అండ్ గ్లామరస్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా సురేఖ వాణికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.
తిరుమలలో సురేఖ వాణి
అయితే తాజాగా నటి సురేఖ వాణి తిరుమలలో సందడి చేశారు. కూతురితో కలిసి కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. శ్రీవారిని దర్శించుకున్న సురేఖ.. అక్కడ తల నీలాలను మొక్కుగా చెల్లించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సురేఖ వాణికి రెడీ, బాద్షా చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సినిమాల్లో అంతగా కనిపించకోపోయిన.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన కూతురు సుప్రీతతో కలిసి చేసే వీడియోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
View this post on Instagram