Krishnamma OTT Release : ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మీడియం రేంజ్, చిన్న సినిమాల విషయంలో ఆడియన్స్ ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలకు థియేటర్స్ లో మంచి టాక్ వచ్చినా కూడా ఎక్కువ శాతం మంది ఆడియన్స్ థియేటర్ కి వెళ్లకుండా ఓటీటీల్లో చూసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు.
దీన్ని ఓటీటీ సంస్థలు క్యాష్ చేసుకొని థీయేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలను కేవలం వారాల గ్యాప్ లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి తెచ్చేస్తున్నారు. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు కూడా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
మాములుగా సినిమా థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య సుమారు 4 నుంచి 6 వారల గ్యాప్ ఉంటుంది. కానీ తాజాగా ఓ సినిమా మాత్రం థియేటర్ లో రిలీజ్ అయిన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది. వారం క్రితమే థియేటర్ లో ఈ సినిమాని చుసిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో రావడాన్ని చూసి షాక్ అవుతున్నారు. ఆ సినిమా మరేదోకాదు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Hero Satyadev) నటించిన ‘కృష్ణమ్మ’.
Also Read : కన్నడ నిర్మాతతో అనుష్క పెళ్లి?
రిలీజైన వారానికే ఓటీటీలోకి
టాలీవుడ్ విభిన్న తరహా పాత్రలు ఎంచుకునే టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా వి.వి. గోపాల కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణమ్మ సినిమా (Krishnamma Movie) మే 10 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరించిన ఫస్ట్ మూవీ ఇది. అందుకే రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ తో సినిమాని ప్రమోట్ చేపించారు.
రిలీజ్ కి ముందు సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దాంతో గుట్టుచప్పుడు కాకుండా సినిమాని ఓటీటీలోకి వదిలారు. మే 17 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో రిలీజైన వారానికే ఓటీటీ లోకి వచ్చేయడంతో ఓటీటీలో సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.