Actor Nani Interview : రాజమౌళి కెరీర్ లో ‘ఈగ’ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. చిన్న హీరోతో ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో రాజమౌళి ఈ మూవీతో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. 2012 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు కొల్లగొట్టింది. నాని, సమంత జంటగా నటించిన ఈ మూవీలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ తన విలనిజంతో ఆకట్టుకున్నారు.
అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాజమౌళికి తనకు మధ్య జరిగిన సరదా సంభాషణను పంచుకున్నారు. ” నేను విజయేంద్ర ప్రసాద్ సర్ని ఎప్పుడూ ‘ఈగ’ సీక్వెల్ గురించి అడగలేదు. కానీ, రాజమౌళితో దీని గురించి సరదాగా చర్చించాను. ‘ఈగ 2’ చేస్తానన్నారు కదా.. ఇది ఎప్పుడు మొదలుపెడదామని అడిగాను.
Also Read : ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం అన్నేళ్లు ఆగాలా? సందీప్ రెడ్డి వంగా సంచలన ప్రకటన..!
అప్పుడు దానికి ఆయన.. ‘మేము ‘ఈగ 2′ చేసినా నీతో అవసరం లేదు. ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్లో తిరిగి వస్తుంది’ అని చెప్పారు. ‘ఈగ’ సినిమా చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఆయనకు దీని సీక్వెల్ గురించి ఆలోచన వచ్చినప్పుడు కచ్చితంగా ఆ పనులు ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నా. అదే జరిగితే మరో అద్భుతమైన చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు” అని తెలిపాడు.