Bollywood Actor Arshad Warsi : బాలీవుడ్ (Bollywood)నటుడు అర్షద్ వర్షీ (Arshad Warsi) తాజాగా తెలుగు సినిమా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ అర్షద్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.‘కల్కి 2898 AD’ (Kalki 2898AD) భారీ బడ్జెట్‌తో నిర్మించబడిన పాన్ ఇండియా చిత్రం.
ప్రభాస్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వర్షీ ఈ మూవీపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రభాస్‌ను విమర్శించారు. ” కల్కి’ సినిమా తనకు నచ్చలేదని తెలిపాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అసలే అర్థం కాడు. ఈ వయసులో కల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నాడు. ఆయనకు ఉన్న పవర్లో నాకు కొంచెం ఉన్న లైఫ్ సెట్ అయిపోతుంది. అతడు అసాధారణమైన వ్యక్తి.
Is Bollywood trying to disrespect #Prabhas ?
In a recent interview, Bollywood actor #ArshadWarsi expressed his dislike for ‘Kalki 2898 AD,’ stating, “Prabhas was like a joker in that film.” and questioning why such films are made.
And Bollywood filmmakers like Om Raut who made… https://t.co/iqiZUXwVVi pic.twitter.com/lS9aeRvY1j
— Whynot Cinemas (@whynotcinemass) August 18, 2024
Also Read : మోహన్ లాల్ కు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ చేరిన నటుడు, ఆందోళనలో ఫ్యాన్స్
నాకు కల్కిలో ప్రభాస్‌ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించింది. అమితాబ్ (Amitabh Bachchan) ముందు అతడు ఒక జోకర్ లాగా కనిపించాడు. ప్రభాస్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అర్షద్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందారు.
‘బాహుబలి’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి నటుడిని ‘జోకర్’ అంటూ అర్షద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రేక్షకులను కించపరిచినట్లే అని భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్షద్ వర్షీకి వ్యతిరేకంగా ఫ్యాన్స్ వరుస పోస్టులు పెడుతూ.. అర్షద్ వర్షీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.