Acharya Vidyasagar Maharaj : జైనమత గురువు, నగ్న ముని ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్(Acharya Vidyasagar Maharaj) తుదిశ్వాస విడిచారు. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) లోని చంద్రగిరి తీర్థంలో మూడు రోజుల క్రితం సజీవ సమాధి అయిన ఆచార్య విద్యాసాగర్.. శనివారం మధ్యాహ్నం కన్ను మూశారు. అయితే ఆయన సజీవ సమాధిలోకి వెళ్లినప్పటి నుంచి తన దేహాన్ని విడిచేవరకు కూడా నిశ్శబ్దాన్ని కొనసాగించారు. ఆయన మరణవార్త ఆదివారం ఉదయం తెలిసింది. దీంతో జైన మతానికి చెందిన ప్రజలు ఆయన సమాధిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు.
Also Read : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక
గతంలో ప్రధాని మోదీకి ఆశీర్వాదం
ఆచార్య విద్యాసాగర్.. సజీవ సమాధిలోకి వెళ్లే ముందే.. ఆయన కోసం జ్ఞాన్ సాగర్ మహరాజ్(Gyan Sagar Maharaj) జైనమత గురువు స్థానాన్ని అప్పగించారు. ఇప్పుడు ఆయన మరణంతో తన శిష్యుల్లోంచి ఒకరిని తదుపరి ఆచార్యగా ప్రకటించారు. నిర్యాపక శ్రామన్ ముని సమయ్సాగర్కు ఈ స్థానాన్ని అప్పగించారు. అయితే గత ఏడాది నవంబర్ 5న ప్రధాని మోదీ(PM Modi).. ఆచార్య విద్యాసాగర్‌ను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. మోదీ అలా ఆచార్య నుంచి ఆశీర్వాదం తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ఇక ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ 1946 అక్టోబర్ 10న కర్ణాటక(Karnataka) లోని బెల్గాం జిల్లా, సదల్గా అనే ఊరిలో పుట్టారు. ఆయకు ముగ్గురు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. వీళ్లందరూ కూడా ఆధ్యాత్మక జీవితాలనే గడిపారు. దాదాపు 500 మందికి పైగా ఆచార్య విద్యాసాగర్ వద్ద శిష్యరికం చేశారు. అయితే ఆయన మరణవార్త వెలుగులోకి రావడంతో.. ప్రధాని మోదీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
आचार्य श्री 108 विद्यासागर जी महाराज जी का ब्रह्मलीन होना देश के लिए एक अपूरणीय क्षति है। लोगों में आध्यात्मिक जागृति के लिए उनके बहुमूल्य प्रयास सदैव स्मरण किए जाएंगे। वे जीवनपर्यंत गरीबी उन्मूलन के साथ-साथ समाज में स्वास्थ्य और शिक्षा को बढ़ावा देने में जुटे रहे। यह मेरा… pic.twitter.com/mvJJPbiiwM
— Narendra Modi (@narendramodi) February 18, 2024
विश्व वंदनीय, राष्ट्र संत आचार्य श्री विद्यासागर महामुनिराज जी के डोंगरगढ़ स्थित चंद्रगिरी तीर्थ में सल्लेखना पूर्वक समाधि का समाचार प्राप्त हुआ।
छत्तीसगढ़ सहित देश-दुनिया को अपने ओजस्वी ज्ञान से पल्लवित करने वाले आचार्य श्री विद्यासागर जी महाराज को देश व समाज के लिए किए गए… pic.twitter.com/bRvbWKPGHW
— Vishnu Deo Sai (@vishnudsai) February 18, 2024
Also Read : దేశంలో పాపులర్ సీఎం ఎవరో తెలుసా ?