కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఓ గంగిరెద్దు సడెన్‌గా దాడి చేసింది. ఓ మహిళ గంగిరెద్దును పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా రెడ్ స్కూటీపై ఓ వ్యక్తి వచ్చాడు. ఒక్కసారిగా బెదిరిపోయిన గంగిరెద్దు ఆ వ్యక్తిపై దాడి చేసింది. ఒక్కసారిగా బెదిరిపోయిన గంగిరెద్దు ఆ వ్యక్తిపై దాడి చేసింది. రోడ్డు పక్కన నడుస్తున్న గంగిరెద్దు రోడ్డు మీదకు పరిగెత్తుకొచ్చి బైకర్‌ను పొడిచింది. ఆ తర్వాత బైక్‌పై నుంచి అమాంతం దూకి పరుగు తీసింది.
బెంగళూరు మహాలక్ష్మి లేఔట్లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఒక్కసారిగా గంగిరెద్దు గుద్దడంతో పక్కనే వెళ్తున్న లారీ కింద పడ్డాడు, లారీ డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయటంతో కింద పడ్డ వ్యక్తికి త్రుటిలో ప్రమాదం… pic.twitter.com/bI4WTaVoC1
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2024
ఈ దాడితో అదే సమయంలో అటుగా వచ్చిన లారీ కింద బైకర్ పడిపోయాడు. అయితే లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. లేదంటే లారీ వెనుక టైర్ల కింద బైకర్ తల నుజ్జునుజ్జయ్యేది. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్లో చోటుచేసుకుంది. ఘటనలో బైకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్కూటీ కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. బైకర్పై గంగిరెద్దు దాడికి సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.