Abhishek Bachchan Buys Six Flats : మాములుగా సినిమా సెలెబ్రిటీలు (Cinema Celebrities) నచ్చితే ఒక్క ఫ్లాటో లేకుంటే విల్లానో కొనుగోలు చేస్తారు. కానీ ఓ బాలీవుడ్ (Bollywood) హీరో మాత్రం ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసాడు. వాటికోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇది తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఆ హీరోకి ఒకేసారి అన్ని ఫ్లాట్స్ కొనాల్సిన అవసరం ఏంటని? అందుకు సంబంధించిన వివరాలను కనుక్కు నే పనిలో పడ్డారు. ఇంతకీ ఆ ఆరు ఫ్లాట్స్ కొన్న హీరో మరెవరో కాదు మన బిగ్ బి అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్..
అమితాబ్ వారసుడిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan).. కెరీర్ స్టార్టింగ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా ఈ హీరో పెద్దగా సినిమాలు చేయడం లేదు. అడపాదడపా సినిమాలు చేసినా అవి సక్సెస్ అందుకోలేదు. దీంతో ఈ హీరో వ్యాపారాల్లో ఎక్కువగా కాన్సట్రేట్ చేస్తూ వస్తున్నాడు. కబడ్డీ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇతడికి ఓ జట్టు కూడా ఉంది.
Also Read : తనకంటే చిన్న వాడితో ‘ప్రభాస్’ హీరోయిన్ డేటింగ్.. వైరల్ అవుతున్న పోస్ట్!
అన్ని కోట్లా?
ఇక తాజాగా ముంబై (Mumbai) లోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడట. ఇవన్నీ కూడా 57వ అంతస్థులో ఉన్నాయి. ఇందులో రెండు ఫ్లాట్స్ ధర చెరో రూ.79 లక్షలు కాగా.. మిగిలిన నాలుగు కూడా తలో ఫ్లాట్ రూ.3.5 కోట్లు విలువ చేసేవి. మొత్తంగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ వీటి కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.