Actress Tamannaah Bhatia : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘స్త్రీ’. 2018 లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇండియాలో రూ.129.83 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.182 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘స్త్రీ 2’ రాబోతుంది. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ ఆగస్టు 15న విడుదల కానుంది.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్ భారీ రెస్పాన్స్ అందుకోగా.. తాజాగా సినిమా నుంచి స్పెషల్ ఐటెం సాంగ్ వదిలారు. ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ చేయడం విశేషం. గత ఏడాది రజినీకాంత్ ‘జైలర్’ లో కావాలయ్యా అంటూ అదరగొట్టిన తమన్నా.. ఇప్పుడు ‘ఆజ్ కీ రాత్’ అంటూ మళ్ళీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ‘ఆజ్ కీ రాత్’ అనే ఈ పాట అంచనాలను మరింత పెంచుతోంది.
Also Read : లండన్ వెకేషన్ లో మెగా ఫ్యామిలీ.. మనవరాలు క్లింకార ఫేస్ రివీల్ చేసిన చిరు..!
ఈ సాంగ్‌లో తమన్నా అద్భుతమైన డాన్స్ మూవ్స్‌తో పాటూ ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోసింది. సాంగ్ లో తమన్నా డ్యాన్స్ మూవ్స్, గ్లామర్ చూస్తుంటే రానున్న రోజుల్లో బెస్ట్ ఐటెం నంబర్ గా నిలిచే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.