పాము పగబట్టడం అనేది కేవలం సినిమాల్లోనే ఉంటుంది…బయట అలా ఏమీ ఉండదు అనుకుంటాము కానీ అది నిజం కాదని నిరూపించింది ఉత్తరప్రదేశ్లోని ఓ పాము. ఓ యువకుడిపై పాము పగబట్టింది. అతడు ఎక్కడకు వెళ్లి వదలడం లేదు. వరుస కాట్లతో బెంబేలెత్తిస్తోంది. ఉన్నచోటు వదిలేసి వేరే ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడ ప్రత్యక్షమై కాటు వేస్తోంది. ఎందుకిలా జరుగుతోందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే ఇప్పటివరకు పాము కాటు నుంచి కోలుకున్న దూబేకు చివరిసారి మాత్రం బాగా ఆరోగ్యం దెబ్బ తింది.
దూబే పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ పాము కాటుకు సంబంధించి వికాస్ కొన్ని విస్తుపోయే వివరాలను తెలిపాడు. తనకు ఇటీవల ఓ కల వచ్చిందని, అందులో తనను పాము 9సార్లు కాటు వేసిందని తెలిపాడు. చివరిసారి పాము కాటు వేసిన సమయంలో తనను ఎవరూ కాపాడలేరని కలలో కనిపించిన వివరాలు వెల్లడించారు. దీంతో వికాస్ తెలిపిన విషయాలతో వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
దూబే పాము కాటు విషయం వింతగా ఉండడంతో.. కేసు వివరాలను దర్యాప్తు చేయడానికి అధికారులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనల వెనుక అసలు విషయాలను వెలికితీయడమే దర్యాప్తు చేపట్టామని తెలిపారు.