Vinesh Phogat 750Kgs Laddu : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) కు స్వదేశంలో ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నుంచి కారులో ఆమెకు కొన్ని కిలోమీటర్ల మేరకు ఊరేగింపు నిర్వహించగా.. 10 గంటలపాటు ప్రయాణించి తన గ్రామానికి చేరుకుంది. హరియాణా (Haryana) లోని బలాలికి అర్ధరాత్రి చేరుకున్న వినేశ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. తన కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్యాన్స్, సన్నిహితులు వినేశ్‌కు బ్రహ్మరథం పట్టారు. ఆమె పెద్దనాన్న, కోచ్ మహవీర్ ఆమెను ఆప్యాయంగా కౌగలించుకుని భావోద్వేగానికి గురయ్యారు. వినేశ్ సైతం కన్నీరు పెట్టుకుంది.
In a now-deleted Facebook post, Vinesh Phogat’s coach Woller Akos revealed the extent of physical strain the wrestler underwent in trying to make weight for the final bout. #VineshPhogat | #Wrestling | 📸 Photos from her return to India: @shashiskashyap pic.twitter.com/zdN4wquLWd
— Sportstar (@sportstarweb) August 17, 2024
ఇదిలా ఉంటే.. ఆమెకు స్థానికులు భారీ ఎత్తున బహుమతులు అందించారు. కొంతమంది ప్రైజ్‌మనీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె కోసం గ్రామస్తులు ప్రత్యేకంగా తయారు చేసిన 750 కేజీల లడ్డూలను అందించారు. అనంతరం వాటిని గ్రామమంతా పంచిపెట్టారు. వినేశ్ పతకం తేకపోయినా.. ఆమెను విజేతాగానే భావిస్తామంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్.. 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైంది. దీంతో ఆమె రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ‘కాస్’లోనూ తీర్పు అనుకూలంగా రాలేదు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తానని ఆమె పెద్దనాన్న మహవీర్ చెబుతున్నారు.