Sexual Harassment: ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రపంచం నలుమూలల మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లలనుంచి మొదలుపెడితే పండు ముసలి వరకూ కామంతో కళ్లు మూసుకుపోయి పశువుల్లా వ్యవహరిస్తున్నారు. వావి వరుసలు లేకుండా చెల్లి, కూతురు, మనవరాళ్లతోనూ సరదాగా సరసలాడుతూనే కామ విషం చిమ్ముతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బిసౌలిలో ఇలాంటి ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ షాపులో మనవరాలి వయసున్న యువతితో ఓ వృద్ధుడు కామ కోరికలతో రెచ్చిపోతూ ఆమె వెనక భాగాన్ని తాకేందుకు తహతహలాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Incident from Uttar Pradesh Bisauli A old man h@rrassing a girl in Broad daylight pic.twitter.com/lxZiXTwJFG
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 31, 2024
ఇది కూడా చదవండి: Hyderabad: లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం.. 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడి!
ఈ మేరకు వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిసోలిలో ఈ ఘటన జరిగింది. నగరంలోని స్థానికంగా ఉన్న దుకాణంలో యువతి ఓ వృద్ధుడి పక్కన నిలబడి ఉంది. ఆ యువతీ ఓవైపు తన వారితో తిరిగి మాట్లాడుతుండగా.. వెనుక వైపు ఉన్న వృద్ధుడు రెచ్చిపోయాడు. దాదాపు 20 ఏళ్ల అమ్మాయి ఓ వైపు తన వారితో మాట్లాడుతుండగానే అమ్మాయి జుట్టును పలుమార్లు పట్టుకుంటూ జుట్టు వాసనను చూశాడు. అటు ఇటు చూస్తూ అమ్మాయి దగ్గరికి వెళ్లి జుట్టును చేత్తో పట్టుకొని వాసన చూడడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తతంగం మొత్తం దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. ఇంత జరిగిన ఆ అమ్మాయికి విషయం తెలియకపోవడం విడ్డురం. ఆ వీడియోని దుకాణం సంబంధించిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ దుర్మార్గుడిపై మండిపడుతున్నారు.