TSRTC : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆర్టీసీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఫ్రీ బస్ ఎఫెక్టు(Free Bus Effect) తో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు తండోపా తండాలుగా భక్తులు తరలివెళ్లగా బస్సులు కిక్కిరిసిపోయాయి. అయితే గురువారం జాతర ప్రధాన ఘట్టం ముగియడంతో మొక్కులు తీర్చుకుని తిరుగుపయనమైన జనాలు.. మందు చిందులతో చిల్ అవుతున్నారు.
సమ్మక్క సారక్క జాతర ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు. pic.twitter.com/bIq3d1ElVz
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2024
బస్సులోనే మందు పార్టీ..
ఇందులో భాగంగానే పలువురు పురుషులు ఏకంగా ఆర్టీసీ బస్సులోనే మందు పార్టీ జరుపుకున్నారు. మేడరం(Medaram) నుంచి వస్తున్న బస్సు ప్రయాణికులతో నిండిపోగా చాలామంది కింద కూర్చున్నారు. అయితే ఓ ఐదుగురు వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న విస్కీని బస్సులోనే ఓపెన్ చేసి చీర్స్ కొట్టారు. పక్కన ప్రయాణికులుండగానే ఫుల్ జోష్ లో ఊగిపోయారు. ఈ తంతంగాన్ని మొత్తం మరో ప్రయాణికుడు వీడియో తీసి ‘సమ్మక్క సారక్క జాతర.. ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు’ అని క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇది కూడా చదవండి : Hyderabad:పార్కుల్లో రాసలీలపై షీ టీమ్స్ స్పెషల్ ఫోకస్.. అదుపులో 12 జంటలు
బలే లాజిక్ గురు..
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి. ‘నేనిదే చెప్పింది, GDP పెరిగేది ఇలానే. ఇప్పుడు వాళ్ళు కొన్న మందు వల్ల ప్రభుత్వానికి లాభమే కదా. బస్ టికెట్ తీసుకుని ఉంటే 100 రూపాయిలు అయిపోయేది కానీ మందు వల్ల ప్రభుత్వానికి 1000 లాభం’, ‘ఇలాంటివి అన్ని ప్రభుత్వం లేదా ప్రభుత్వ పెద్దలు వచ్చి అడ్డుకోవాలా? నీకు ఇది తప్పు అని అనిపించింది. అప్పుడు వీడియో తీసి సోషల్ మీడియా(Social Media) లో పెట్టీ ప్రభుత్వాన్ని తిట్టాలి. బలే లాజిక్ గురు’ అని పలువురు అంటున్నారు. మరి దీనిపై సజ్జనార్ ఎలా స్పందిస్తాడు? మందు బాబులపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడనే దానిపై ఆసక్తి నెలకొంది.