BSNL Cinemaplus: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ (BSNL) తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్ర్కైబర్లకు అందించే సినిమాప్లస్ (BSNL Cinemaplus) ఓటీటీ ప్యాకేజీ ధరను తగ్గించింది. స్టార్టర్ ప్యాక్ కోసం ఇంతకుముందు నెలకు రూ.99 వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే ప్లాన్ ను రూ.49కు అందిస్తున్నట్లు తెలిపింది. ఎపిక్ ఆన్, లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా ఓటీటీ కంటెంట్ అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది.
Experience boundless entertainment with BSNL’s #PV2399 plan – games, music, and beyond!#RechargeNow: https://t.co/cF9H9EM5Se (For NZ,WZ & EZ), https://t.co/WatOOBUY1O (For SZ)#BSNL #BSNLRecharge pic.twitter.com/x2Aom2KiIX
— BSNL India (@BSNLCorporate) April 25, 2024
ఇది కూడా చదవండి: Viral video: పాపం పసివాడు.. అపార్ట్మెంట్ 2వ అంతస్తులో వేలాడిన చిన్నారి.. వీడియో వైరల్!
అలాగే మరో రెండు ప్లాన్లను కూడా అందించబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే సినిమాప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒకే లాగిన్‌తో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. ఎక్స్ట్రీమ్ ప్లే పేరిట ఎయిర్టెల్, జియోటీవీ ప్రీమియం పేరిట జియో, టాటా ప్లే బింజ్‌తో టాటా సైతం ఈ తరహా ప్యాకేజీలను అందిస్తోంది. స్టార్టర్ ప్యాక్ మాత్రమే రూ.49తో వస్తుంది. జీ5, సోనీలివ్, యప్‌టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్ ఫుల్ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ అవకాశం కల్పించింది. దీని ధర నెలకు రూ.199. రూ.249తో బీఎస్ఎన్ఎల్ ప్రీమియం ప్లాన్‌ను కూడా ఇస్తోంది. దీంట్లో జీ5, సోనీ లివ్, డిస్నీ+ హాట్‌స్టార్, యప్‌టీవీ, లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా, వంటి ఓటీటీలను ఎంజాయ్ చేయొచ్చు.