Dhanush 3 Movie : తమిళనాట దళపతి విజయ్, తల అజిత్ లతో పోటీపడుతూ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిన చిత్రం ‘3’. ఈ సినిమాతోనే సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్, దర్శకురాలిగా ఐశ్వర్య రజనీకాంత్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాలో లవ్ స్టోరీ, సాంగ్స్, అనిరుద్ బిజీయం ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమిళంతో పాటూ తెలుగులోనూ భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీని మళ్ళీ రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుతున్నారు.
Also Read : ‘తంగలాన్’ కోసం విక్రమ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
ఇప్పటికే తమిళంలో ఓసారి రీ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 14న ‘3’ మూవీని థియేటర్లలో తిరిగి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.