T20 World Cup Semis: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు స్వల్ప మొత్తానికి ఆలౌటైంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ కెప్టెన్ ఈ నిర్ణయం తప్పని పవర్‌ప్లేలోనే దక్షిణాఫ్రికా బౌలర్లు నిరూపించారు. తొలి ఓవర్ లోనే రహ్మానుల్లా గుర్బాజ్ (0) వికెట్ తీసి మార్కో జాన్సెన్ తొలి విజయాన్ని అందుకోగా, మూడో ఓవర్లో గుల్బుద్దీన్ నైబ్ (9) అవుటయ్యాడు. దీని తర్వాత అజ్మతుల్లా ఓవర్జాహి (10) కూడా వికెట్ తీశాడు.
పూర్తిగా చదవండి..T20 World Cup Semis: అయ్యో.. ఆఫ్ఘన్ అలా అయిపోయిందేంటీ! చెత్త రికార్డ్!!
సంచలనాలు సృష్టించి సెమీస్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ అసలైన పోరులో బ్యాట్లు ఎత్తేసింది. సౌతాఫ్రికాతో ట్రినిడాడ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఆఫ్గనిస్తాన్ 56 పరుగులకే ఆలౌట్ అయింది. ఏ దశలోనూ కూడా సౌతాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు ఆఫ్ఘన్ బ్యాటర్లు.
Translate this News: