T20 World Cup 2024: తొలిసారి అమెరికాతో భారత్ పోటీ! ఏమవుతుందో?

టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఈరోజు టీమిండియా అమెరికాతో తలపడుతుంది. ఇప్పటికే రెండు జట్లు తామాడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి ఊపు మీద ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు తదుపరి దశ సూపర్ 8 కు నేరుగా చేరుకుంటుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 

New Update
T20 World Cup 2024: తొలిసారి అమెరికాతో భారత్ పోటీ! ఏమవుతుందో?

T20 World Cup 2024: T20 ప్రపంచ కప్ 2024: T20 ప్రపంచ కప్ లో టీమిండియా, USA జట్లు పోటీ పడబోతున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం (జూన్ 12) జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8 దశకు చేరుకుంటుంది. ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడంతో ఈరోజు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్  తదుపరి దశకు చేరుకోవచ్చు.

T20 World Cup 2024: విశేషమేమిటంటే టీ20 క్రికెట్‌లో భారత్, అమెరికా జట్లు తలపడడం ఇదే తొలిసారి. ఇక్కడ భారత జట్టు బలంగా ఉన్నప్పటికీ, USA వైపు నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, గత మ్యాచ్‌లో అమెరికా జట్టు పాకిస్థాన్ జట్టును ఓడించి చరిత్ర లిఖించింది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు  భారత్‌పై రంగంలోకి దిగుతోంది అమెరికా. అందుకే, ఈ మ్యాచ్‌లోనూ ధీటైన పోరాటాన్ని మనం చూసే అవకాశం ఉంది. 

Also Read: అర్ష్‌దీప్ సింగ్‌కి క్షమాపణలు చెప్పిన కమ్రాన్ అక్మల్!

మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
T20 World Cup 2024: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు భారత్, అమెరికా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దీనికి ముందు 7.30 గంటలకు టాస్ నిర్వహిస్తారు. స్టార్ నెట్‌వర్క్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అలాగే, ఈ మ్యాచ్ ను మీరు డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో కూడా ఉచితంగా చూడవచ్చు.

రెండు టీమ్స్ లో ప్లేయర్స్ వీరే..
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

యూఎస్‌ఏ జట్టు: మోనాక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరీ అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్తుష్ కెంజిగే, సౌరభ్ నేట్రల్‌వాకర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, స్టీవెన్ టాయ్ జహంగీర్. సబ్‌లు: గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్‌డేల్, యాసిర్ మొహమ్మద్.

Advertisment
తాజా కథనాలు