T20 World Cup 2024: మళ్ళీ ఓడిన న్యూజీలాండ్.. సూపర్-8 కు చేరిన విండీస్!

టీ20 ప్రపంచకప్‌లో 26వ మ్యాచ్ లో న్యూజీలాండ్ జట్టును విండీస్ 13 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన విండీస్ సూపర్-8కి అర్హత సాధించింది. మరోవైపు న్యూజీలాండ్ తన సూపర్-8 ఛాన్స్ లను క్లిష్టతరం చేసుకుంది. 

New Update
T20 World Cup 2024: మళ్ళీ ఓడిన న్యూజీలాండ్.. సూపర్-8 కు చేరిన విండీస్!

T20 World Cup 2024:  టీ20 ప్రపంచకప్‌లో 26వ మ్యాచ్ జూన్ 13న న్యూజిలాండ్ - వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. దీంతో వెస్టిండీస్ కూడా సూపర్-8కి అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు శుభారంభం లభించలేదు. సగం జట్టు స్కోరు 30 వద్ద పెవిలియన్‌కు చేరుకుంది. అయితే, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ తుఫాను ఇన్నింగ్స్‌తో  వెస్టిండీస్ జట్టు 150 పరుగుల లక్ష్యాన్ని అందించడంలో విజయవంతమైంది. లక్ష్య ఛేదనలో  న్యూజిలాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.  ఈ ఓటమి తర్వాత, జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో పడింది. 

మ్యాచ్‌ను మలుపు తిప్పిన రూథర్‌ఫర్డ్
T20 World Cup 2024:  వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్ న్యూజిలాండ్‌కు చాలా ముఖ్యమైనది.  ఎందుకంటే, మొదటి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ట్రినిడాడ్‌లో విలియమ్సన్ జట్టు ఆ ఓటమిని మరిచిపోయి కొత్త శుభారంభం చేసింది. వెస్టిండీస్‌కు తొలి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా విండీస్ వికెట్లు పతనమవుతూ వచ్చాయి. న్యూజిలాండ్ స్కోరు 100 దాటే సమయానికి ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. 17వ ఓవర్‌లో వెస్టిండీస్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్కడ నుంచి రూథర్‌ఫోర్డ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి, అతను 39 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ 149 పరుగులు చేయగలిగింది. మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 

Also Read: ఓహ్! ఆ రికార్డులో రెండో స్థానం విరాట్ కోహ్లీ దే ! మొదటి స్థానం ఎవరిదంటే.. 

న్యూజిలాండ్‌ను బౌలర్లు చిత్తు చేశారు
T20 World Cup 2024:  150 పరుగులు చేసినప్పటికీ, లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంది.  అయితే, బ్యాటింగ్ లో అద్భుతం చేసిన వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్‌ను బంతితో కూడా ఓడించింది. కివీస్ జట్టుకు స్పిన్నర్ అకిల్ హుస్సేన్ తొలి దెబ్బ తీశాడు. దీని తర్వాత, గుడాకేష్ మోతీ, అల్జారీ జోసెఫ్ పవర్‌ప్లేలో న్యూజిలాండ్ జట్టును నాశనం చేశారు. జోసెఫ్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మోతీ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో మొత్తం న్యూజిలాండ్ వెన్ను విరిగిపోయింది. చివర్లో, మిచెల్ సాంట్నర్ 3 సిక్సర్లు కొట్టి కొంచెం ప్రయత్నించాడు కానీ జట్టును గెలిపించలేకపోయాడు.

న్యూజిలాండ్ గ్రూప్ దశ నుంచే ఔట్ అవుతుందా?
T20 World Cup 2024:  టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ గ్రూప్‌ సిలో ఉంది. ఒకవైపు ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్ సూపర్-8కి అర్హత సాధించింది. మరోవైపు గ్రూప్ దశలోనే న్యూజిలాండ్ నిష్క్రమించే ప్రమాదంలో పడింది. ఒకరకంగా చూస్తే  న్యూజిలాండ్ ఇప్పటికీ సూపర్-8కి వెళ్లగలదు. మరోవైపు నెట్ రన్ రేట్ (ఎన్ ఆర్ ఆర్ ), ఆఫ్ఘనిస్థాన్ ఫామ్ ను పరిశీలిస్తే న్యూజిలాండ్ నిష్క్రమణ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. . ఆఫ్ఘనిస్తాన్ NRR +5.225, న్యూజిలాండ్ -2.425 గా ఉంది. ఇప్పుడు న్యూజీలాండ్ ముందుకు వెళ్లాలంటే.. ఆఫ్ఘనిస్తాన్ పై భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు మిగిలిన రెండు మ్యాచ్‌లను కూడా భారీ తేడాతో గెలవాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు