Mental Health Tips: బిజీ బిజీగా సాగుతున్న ఈ లైఫ్ లో చాలా మంది శారీరక, మానసిక ఆరోగ్యం పై అంతగా చూపలేకపోతారు. ఏదో ఒక టెన్షన్స్ తో స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇది మానసిక ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే విశ్రాంతి తప్పనిసరి. మానసిక విశ్రాంతి అవసరమని చెప్పే సంకేతాలు ఇవే.
మానసిక విశ్రాంతి అవసరమని చెప్పే సంకేతాలు ఇవే.
చిరాకు
మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు.. మనం చేసే పనులు కూడా కొన్ని సార్లు మన కంట్రోల్ లో ఉండవు. కారణం లేకుండానే చిరాకు, బాధను వ్యక్తం చేస్తారు. ప్రతీ చిన్న విషయానికి ఇతరుల పై చిరాకు పడడం, అరవడం చేస్తుంటారు. మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో మానసిక విశ్రాంతి చాలా అవసరం.
మూడ్ స్వింగ్స్
మెంటల్ హెల్త్ సమస్యలతో బాధపడే వారిలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కోపం, బాధ, చిరాకు, సంతోషం అన్నింటినీ ఒకే సారి చూపిస్తుంటారు. ఇది మెంటల్ హెల్త్ బాగాలేదని చెప్పే సంకేతం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు.. మనసుకు ప్రశాంతతను, ఆనందాన్ని కలిగించే పనులు ఎక్కువగా చేయాలి. దీని వల్ల కాస్త రిలాక్షేషన్ కలుగుతుంది.
Also Read: Alcohol Tips: ఆల్కహాల్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఆరోగ్యం పాడైనట్లే
తల నొప్పి
ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు తల నొప్పి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఏ పని కూడా ఫోకస్ చేయలేకపోతారు. ఇలాంటి సమస్య ఉంటే మానసిక విశ్రాంతి తప్పనిసరి.
నిద్రలేమి
నిద్రలేమి సమస్య మానసిక ఆరోగ్యం విపరీతమైన ప్రభావం చూపుతుంది. మానసిక సమస్యలు ఉన్నప్పుడు ఒత్తిడి పెరిగి సరైన నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది. ఈ సమస్య మానసిక విశ్రాంతి అవసరమని చెప్పే ముఖ్య సంకేతం.
ఒంటరితనం
మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఒంటరితనం ఎక్కువగా ఫీల్ అవుతారు. అందరితో కలవకపోవడం, స్నేహితులకు దూరంగా గడపడం చేస్తుంటారు. ఒంటరితనం మానసిక ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మానసిక ఆరోగ్యం పై మరింత దృష్టి పెట్టాలి.
Also Read: Cashew: ఈ సమస్యలు ఉంటే జీడి పప్పుకు దూరంగా ఉండండి.. లేకపోతే అంతే సంగతి!