Mobile Data: మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా..? అయితే ఫోన్ లో ఇది ఆన్ చేయండి

మొబైల్ లో డైలీ డేటా త్వరగా అయిపోతుందా..? మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డేటాను సేవ్ చేయడానికి ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో 'డేటా సేవర్ మోడ్' అనే ఫీచర్ ఉంటుంది. అది ఆన్ చేయడం ద్వారా బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ డేటాను వినియోగించకుండా. సేవ్ చేస్తుంది.

New Update
Mobile Data: మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా..? అయితే ఫోన్ లో ఇది ఆన్ చేయండి

Mobile Data: భారతదేశంలో మొబైల్ డేటా మునుపటి కంటే చౌకగా మారింది. అయితే ప్రస్తుతం డేటా వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. WiFi అందుబాటులో లేనప్పుడు.. చాలా మంది 2GB, 1GB ఇలా రకరకాల రోజువారీ డేటా ప్యాక్‌ వేసుకుంటారు. అయినప్పటికీ డేటా త్వరగా అయిపోవడంతో మళ్ళీ అదనపు డేటా ప్యాక్‌ని కొనుగోలు చేయాల్సి చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో డేటాను సేవ్ చేయడానికి ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి.

డేటా సేవ్ చేయడానికి Android ఫోన్‌లలో ఒక ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు డేటాను వినియోగించకుండా ఆపవచ్చు. అదే 'డేటా సేవర్ మోడ్'. డేటా సేవర్ మోడ్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని ఇంటర్నల్ ఫీచర్. ఇది WiFi అందుబాటులో లేనప్పుడు ఇది యాప్‌ల డేటా వినియోగాన్ని పరిమితం చేస్తుంది. డేటా సేవర్ ఆన్‌లో ఉంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లు ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వవు. అంటే వారికి అప్‌డేట్‌లు రావు.

publive-image

WiFi కాకుండా నెలవారీ డేటాను నెలవారీ డేటా వినియోగించే వారికి ఈ డేటా సేవర్ మోడ్ చాలా సహాయపడుతుంది. అలాగే తక్కువ బ్యాటరీ విషయంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే, యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో తక్కువగా అప్‌డేట్ చేయబడినప్పుడు, అవి తక్కువ ఛార్జ్ ను ఉపయోగిస్తాయి. దీని వల్ల బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఈ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా, మీరు చాలా యాక్టివ్‌గా ఉపయోగిస్తున్న యాప్ తక్కువ ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తుంది.

Also Read: Cool Drinks: వేసవిలో కూల్ డ్రింక్స్ గ్లాసులు గ్లాసులు తాగుతున్నారా..? ఇక మీ లివర్ పాడైనట్లే జాగ్రత్త..!

Advertisment
Advertisment
తాజా కథనాలు