Miss Global India: మిస్‌ గ్లోబల్‌ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న కర్ణాటక భామ!

మిస్ గ్లోబల్ ఇండియా-2024 కిరీటాన్ని బెంగళూరుకి చెందిన స్వీజల్ ఫుర్టాడో కైవసం చేసుకుంది. జులై 28న జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్‌లో జరిగిన మిస్ సూపర్ మోడల్ ఇండియా ఈవెంట్‌లో ఆమెకు ఈ కిరీట పట్టాభిషేకం జరిగింది.

New Update
Miss Global India: మిస్‌ గ్లోబల్‌ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న కర్ణాటక భామ!

Sweezal Furtado As Miss Global India: మిస్ గ్లోబల్ ఇండియా-2024 కిరీటాన్ని బెంగళూరుకి చెందిన స్వీజల్ ఫుర్టాడో కైవసం చేసుకుంది. జులై 28న జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్‌లో జరిగిన మిస్ సూపర్ మోడల్ ఇండియా ఈవెంట్‌లో ఆమెకు ఈ కిరీట పట్టాభిషేకం జరిగింది. అద్భుతమైన పోటీల కెరీర్‌లో ఫుర్టాడోకు ఇది ఒక మైలురాయి అని చెప్పుకొవచ్చు. 19 ఏళ్ల స్వీజల్.. అందాల పోటీలు.. మోడలింగ్‌లో ముందుకు దూసుకెళ్తుంది.

ఈమె ప్రయాణం ‘ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇగ్నైట్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకోవడంతో మొదలైంది. ఆ తర్వాత మిస్ సూపర్ మోడల్ ఇండియా 2022 పోటీలో రెండవ రన్నరప్ గా నిలిచింది. జూన్ 2023లో ఆమె ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. పెరూలోని మిస్ టీన్ ఇంటర్నేషనల్ పోటీలో మిస్ టీన్ యూనివర్సల్ 2023, ఇంటర్నేషనల్ ప్రిన్సెస్ టైటిల్‌ను కూడా గెలిచింది.

మిస్ టీన్ యూనివర్సల్ ఆసియా, బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ టైటిళ్లను సొంతం చేసుకుని తన ప్రత్యేకతను చాటుకుంది.‘సౌత్ ఇండియా సూపర్ మోడల్’గా పేరుగాంచిన స్వీజల్ ప్రతిభావంతులైన నృత్యకారిణి కూడా.

Also Read: నేడు రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం

Advertisment
తాజా కథనాలు