Nikhil: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్‌ యంగ్‌ హీరో!

టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ తండ్రి కాబోతున్నాడంటూ..నెట్టింట్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ విషయం గురించి ఇంకా నిఖిల్‌ స్పందించలేదు.

New Update
Nikhil: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్‌ యంగ్‌ హీరో!

Nikhil Siddharth: టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ ..హ్యాపీడేస్‌ సినిమాతో కెరీర్‌ మొదలు పెట్టి..కార్తీకేయ 2 (Karthikeya 2) తో పాన్‌ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు పాన్‌ ఇండియా సినిమాలు ఉన్నాయి. స్వయంభూ, ఇండియన్‌ హౌస్‌, కార్తీకేయ 3 సినిమాలు నిఖిల్‌ చేతిలో ఉన్నాయి.

తాజాగా నిఖిల్‌ కి సంబంధించన ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. నిఖిల్‌ త్వరలోనే తండ్రి కాబోతున్నాడంటు..సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తుంది. టాలీవుడ్ కమెడియన్‌ హర్ష ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీకి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీస్‌ హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి నిఖిల్‌ తన భార్య పల్లవి వర్మతో కలిసి హాజరయ్యాడు. ఆ ఫోటోలను నిఖిల్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకోగా..అభిమానులు సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో అభిమానులు కేవలం ఫోటోలకు లైక్‌ లు కొట్టడమే కాకుండా మరో విషయాన్ని కూడా గమనించి వైరల్‌ చేస్తున్నారు.

publive-image

ఆ ఫోటోల్లో పల్లవి వర్మ (Pallavi Varma) బేబీ బంప్‌ తో కనిపిస్తున్నారని, ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నారా, నిఖిల్‌ త్వరలోనే తండ్రి కాబోతున్నారా అనే సందేహన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడ్‌ న్యూస్‌ ని నిఖిల్‌ అనౌన్స్ చేయకపోయినప్పటికీ అభిమానులే తమలో తామే నిర్ధారించుకుని తెగ సంతోషపడిపోతున్నారు.

నిఖిల్‌ కానీ, ఆయన భార్య కానీ ఈ విషయాన్ని ఆఫీషీయల్‌ గా అనౌన్స్‌ చేయలేదు. మరీ వారు ఈ విషయం ఎప్పుడూ చెబుతారో వేచి చూడాలి. కొంత కాలం క్రితం నిఖిల్‌ ఆయన భార్య విడిపోతున్నట్లు కొన్ని వార్తలు వైరల్‌ కాగా వాటిని నిఖిల్‌ ఖండించారు. నిఖిల్‌ పల్లవి వర్మను 2020 లో కొవిడ్‌ ఆంక్షల మధ్య పెళ్లి చేసుకున్నారు. పల్లవి వర్మ డాక్గర్‌.

నిఖిల్‌ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్వయంభూ అనే సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాతో వందల ఏళ్ల క్రితం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కొద్ది రోజుల క్రితమే టాలీవుడ్‌ కి చెందిన మరో యంగ్‌ హీరో శర్వానంద్‌ తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే నిఖిల్‌ భార్య కూడా బేబీ బంప్‌ తో కనపడడంతో నిఖిల్‌ కూడా ఆ శుభవార్త త్వరలోనే ఫ్యాన్స్‌ కి చెప్పనున్నట్లు తెలుస్తుంది.

Also read: కార్తీక మాసం సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ!

Advertisment
తాజా కథనాలు